Thursday, 11 January 2018

త్వరలో అందుబాటులోకి ఎగిరే రిక్షాలు

  • కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా ప్రకటన
జంషెడ్‌పూర్‌, జనవరి 10:నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యతో విసుగొస్తోందా? ఎక్కడికి వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారా? అయితే అలాంటి సమస్యలను అధిగమించేందుకు భవిష్యత్తులో ఎగిరే రిక్షాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా. డ్రోన్‌ పరిజ్ఞానంతో సులువుగా ప్రయాణించేందుకు వీలుగా ఎగిరే రిక్షాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆటో రిక్షాలో ప్రయాణించేందుకు, ఆకాశంలో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు సమానమేనని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. ఇప్పటికే యూఏఈ, జర్మనీలో డ్రోన్‌ టెక్నాలజీ సాయంతో ఎయిర్‌ సర్వీసులు నడుస్తున్నాయని, అదే తరహాలో భారత్‌లోనూ ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విమానయాన శాఖ ఈ దిశగా నిబంధనలు రూపొందిస్తోందన్నారు.

No comments:

Post a Comment