సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ఆరంభంలో భారతీరాజా సినిమాల్లో నటించాడు. భారతి దర్శకత్వం వహించిన ‘16 యేళ్ల వయసు’ తమిళ వెర్షన్(ఒరిజినల్ వెర్షన్)లో రజనీకాంత్ ది నెగిటివ్ పాత్ర. ఇక దక్షిణాదినే ప్రతిభావంతమైన, వైవిధ్యభరితమైన దర్శకుల్లో భారతీరాజా ముందువరసలో ఉంటారు.
కేవలం సినిమాల వరకే కాకుండా.. తమిళ రాజకీయాలపై కూడా హాట్ కామెంట్స్ చేయడంలో కూడా భారతీరాజా ముందుంటారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడి తాజా వ్యాఖ్యానాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. రాజకీయ ప్రవేశం చేయనున్నాను అని ప్రకటించిన రజనీకాంత్ పై ఒక రేంజ్ లో దుమ్మెత్తిపోశాడు భారతీరాజా.
ఒక రకంగా చెప్పాలంటే.. తూర్పారబట్టాడు. రజనీకాంత్ నాన్ లోకల్ అని గట్టిగా చెప్పిన ఈ దర్శకుడు.. అతిథివి అతిథిలా ఉండు.. అని ఘాటుగా హెచ్చరించాడు. తమిళనాడు రాజకీయల గురించి మాట్లాడే అర్హతే రజనీకాంత్ కు లేదని భారతీరాజా అన్నాడు.
‘పాలన సరిగా లేదు..’ అన్న రజనీకాంత్ వ్యాఖ్యానంపై కూడా భారతీ రాజా ఘాటుగా స్పందించారు. ‘ఆ మాట అనడానికి నువ్వెవరు..?’ అని అంటూ.. రజనీకాంత్ నాన్ లోకల్ అనే వాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడీయన. అంతేకాదు.. ‘అభిమానులతో సమావేశాలు’ అంటూ రజనీ చేస్తున్న రాజకీయం పట్ల కూడా భారతీరాజా తీవ్రంగా స్పందించారు.
‘నీకు ఉన్నత భావాలే ఉంటే.. నీ కటౌట్లను పాలతో అభిషేకించే అమాయకులను మరింత సోమరిపోతులుగా తయారుచేసే వాడికి కాదు. ఇప్పుడు వారి అమాయకత్వాన్నే పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నావు. నువ్వు క్షమార్హుడివి కావు..’ అని భారతీరాజా తీవ్రంగా వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment