న్యూఢిల్లీ :రైల్వే క్లోక్ రూమ్స్, లాకర్స్ ఇకపై మరింత ప్రియం కాబోతున్నాయి. వీటిలో లగేజ్ దాచుకోవాలంటే ఇప్పటి కన్నా ఎక్కువ ఛార్జీలు చెల్లించక తప్పదు. రైల్వే స్టేషన్లలో క్లోక్ రూమ్స్, లాకర్ల వినియోగ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్లకు కట్టబెడుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
ఈ సేవలను ఆధునికీకరించేందుకు త్వరలో బిడ్డింగ్ సిస్టమ్ ప్రారంభం కాబోతోంది. ఏటా ఈ ఛార్జీలను పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుత విధానంలో 24 గంటలపాటు లాకర్‌ను ఉపయోగించుకుంటే రూ.20 వసూలు చేస్తున్నారు. 24 గంటల కన్నా ఎక్కువ సమయం లాకర్‌ను ఉపయోగించుకుంటే మరో 24 గంటల వరకు రూ.30 వసూలు చేస్తున్నారు. అంతకుముందు ఈ ఛార్జీ రూ.15 మాత్రమే ఉండేది.

No comments:
Post a Comment