Wednesday, 17 January 2018

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పోస్టర్ చిత్రం యూనిట్ విడుదల చేసింది.


తేజ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తున్న మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రమైన ‘ఎన్.టి.ఆర్’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా చిత్ర యూనిట్ ఈ బయోపిక్‌కి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేసింది. అసలైతే జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ బయోపిక్‌కి సంబంధించిన టీజర్‌ని విడుదల చేయాలని చూశారు. అనివార్య కారణాల వల్ల టీజర్‌ని విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.
 
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ‘‘ ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయంగా జీవించిన.. ఓ మహానుభావునికి ఇదే మా నివాళి..’’ అంటూ ఎన్టీఆర్ ఎలక్షన్ల టైమ్‌లో ప్రచారం చేస్తున్న లుక్‌లో బాలయ్య ఉన్న ఫొటోను విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా బాలకృష్ణ, సాయి కొర్రపాటిలు నిర్మిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి కెమెరామెన్ కాగా, ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment