హిందూపురం, న్యూస్‌టుడే: బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడి చికిత్సల నిమిత్తం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్థిక సాయం అందజేశారు. హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్(12) ప్రస్తుతం హైదరాబాద్‌లోని బసవ తారక క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గతంలో హిందూపురం వచ్చిన ఎమ్మెల్యేను బాలుడి తల్లిదండ్రులు కలిసి ఆదుకోవాలని విన్నవించారు. స్పందించిన ఆయన హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు అయ్యాయి. గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మంజూరు పత్రాన్ని బాధితుడికి అందజేశారు. బాలకృష్ణ తను సొంతంగా మరో రూ.10 లక్షలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో బాలుడికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డీఈ రమేష్‌కుమార్ తెలిపారు.

No comments:
Post a Comment