10 లక్షల మందికి నిరుద్యోగ భృతి
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం భృతిని అందించనుంది. కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండి.. ఉద్యోగం లేనివారికి ఈ భృతి చెల్లించేందుకు నిర్ణయించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనుంది.
లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్‌లోనే నిరుద్యోగ భృతి వేయనుంది ప్రభుత్వం. కుటుంబంలో ఇద్దరు అర్హులు ఉన్నా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కల్గినవారే ఇందుకు అర్హులుగా ప్రకటించింది. నిరుద్యోగ భృతి తీసుకున్నవారిని.. ప్రభుత్వం చేపట్టిన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయనుంది. నిరుద్యోగ భృతి అమలుతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి 1200 కోట్లు రూపాయల భారం పడనుంది.
రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం.. 12 దేశాల్లో ఇస్తున్న నిరుద్యోగ భృతిని పరిశీలించింది. మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం.. కొన్ని విధివిధానాలనూ కూడా రూపొందించింది. వీటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాక.. వారి స్పందనను బట్టి మార్పులు చేర్పులు చేయనుంది. అనంతరం మరోసారి కేబినెట్‌లో చర్చించి అమలుచేసే తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


No comments:
Post a Comment