సంక్రాంతి వేళ విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది ఎయిర్‌ఏషియా విమానయాన సంస్థ. పండుగ సీజన్‌లో బంపర్ ఆఫర్ ప్రకటించింది. విమాన ప్రయాణికులకు కేవలం 99 రూపాయలకే (బేస్ ఛార్జ్) విమాన టికెట్ అందించనున్నామని సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ హైదరాబాద్ సహా మరో ఆరు నగరాల్లో (బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, న్యూదిల్లీ, పూణె, రాంచీ) వర్తించనుందని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఈ టికెట్‌ను సోమవారం నుండి మొదలుకొని జనవరి 21 వరకు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ క్రింద టికెట్ పొందిన ప్రయాణికులు జనవరి 15 నుంచి జులై 31 మధ్య ఎప్పుడైనా తమ ప్రయాణాన్ని సాగించవచ్చు.
దీంతోపాటుగా ఇతర దేశాలైన బ్యాంకాంక్, కౌలాలంపూర్, మెల్‌బోర్న్, ఆక్లాండ్, సిడ్నీ వెళ్లే ప్రయాణికులకు కూడా మరో ఆఫర్ ప్రకటించింది ఎయిర్‌ఏషియా. ఇందుకోసం 1,499 రూపాయలను బేస్ చార్జిగా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్స్ మాత్రం ఎయిర్‌ఏషియా.కామ్, ఎయిర్‌ఏషియా మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తాయని తెలిపింది ఎయిర్‌ఏషియా యాజమాన్యం. దీంతో ఈ పండుగ వేళ విమాన ప్రయాణికుల్లో ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి.

No comments:
Post a Comment