Saturday, 6 January 2018

కత్తిపై పవన్ కల్యాణ్ పరోక్ష ట్వీట్.....కత్తి కౌంటర్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రముఖ సినీ విమర్శకుడు,బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతూనే ఉంది.కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల పై విమర్శలు చేయడం.. దానికి బదులుగా పవన్ అభిమానులు కత్తి ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుర్భాషలాడటం కొనసాగుతూనే ఉంది.ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేపుతోంది. '' వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. నీ కులం , ధనం , వర్ణం గురించి మాట్లాడుతారు. ( ఎవరు చెప్పారో తెలియదు కానీ ఓ సీనియర్ జర్నలిస్టు ఉదయాన్నే నాకు పంపించారు.బాగుందని షేర్ చేస్తున్నా '' అని పవన్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment