చెన్నై: భారతదేశంలో పండగలకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఒక్కొక్క పండగ జరుపుకోవడం వెనుక ఒక్కొ కారణం ఉంటుంది. అలాగే సంక్రాంతి ముందురోజు వేసుకొనే భోగి మంటలు దీనిలో భాగమే. ఇప్పుడు ఈ సంప్రదాయమే చెన్నై విమానాశ్రయానికి పొగ పెట్టింది. దట్టమైన పొగ చుట్టుముట్టడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశవిదేశాలనుంచి వస్తున్న విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చెన్నై విమానాశ్రయానికి కువైట్, షార్జా, దిల్లీ నుంచి వస్తున్న 18 విమానాలను దారి మళ్లించి హైదరాబాద్, బెంగళూరు పంపించారు. దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారుల మీద కూడా ఈ ప్రభావం పడింది. దారికనబడక వాహనదారులు హెడ్‌లైట్ల వెలుతురులోనే వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్యావరణహితంగా పండగ జరపుకోవాలని ప్రభుత్వం ముందుగానే అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతానికి పరిస్థితి కొంతమేర మెరుగుపడిందని అధికారులు వెల్లడించారు.
No comments:
Post a Comment