Saturday, 13 January 2018

బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన భారత్

దుబాయ్:ఐదో అంధుల ప్రపంచకప్‌‌లో భారత్ విజయపరంపర కొనసాగిస్తుంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత కెప్టెన్ అజయ్ రెడ్డి(బీ-2), సునీల్ రమేష్(బీ-3) ఇద్దరు కలిసి లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే చేధించారు. రెడ్డి 60 బంతుల్లో 14 ఫోర్లతో 101 పరుగులు చేయగా, రమేష్ 57 బంతుల్లో 17 ఫోర్లతో 105 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఒక వికెట్‌ కూడా నష్టపోకుండా మ్యాచ్‌లో విజయం సాధించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment