హైదరాబాద్: సంక్రాంతి సందడి మొదలైంది. నిత్యం రద్దీగా ఉండే నగరాలు ఖాళీ అవుతుండగా.. పల్లెలు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి స్వంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పొటెత్తున్నారు. దాంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పొడువునా వాహనాలే కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా వద్ద పది గేట్లు ఎత్తినా వాహనాలు రద్దీ తగ్గలేదు.
No comments:
Post a Comment