న్యూఢిల్లీ : ఆధార్ సమాచార భద్రతకు కట్టుదిట్టమైన బిల్లును మార్చినాటికి సిద్ధం చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ ఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందిస్తోందని పేర్కొంది.
వ్యక్తిగత గోప్యతకుగల ప్రాథమిక హక్కును ఆధార్ చట్టం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం ఈ హామీనిచ్చింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ డీ వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు. ఆధార్ చట్టం రాజ్యాంగ బద్ధతను పిటిషనర్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

No comments:
Post a Comment