Monday, 22 January 2018

బన్నీ సినిమా యూనివర్సల్ రిలీజ్

ఓ సినిమాపై డౌట్ కొడితే ఏం చేయాలి. అత్యథిక థియేటర్లలో రిలీజ్ చేయాలి. అలా చేయడం వల్ల కనీసం మొదటి 3రోజుల్లోనైనా కూసింత రికవరీ అవ్వొచ్చు. ఇప్పుడు దీనికి అడ్వాన్స్ ఆలోచన కూడా వచ్చింది. అత్యథిక థియేటర్లతో పాటు అత్యథిక భాషల్లో కూడా విడుదల చేస్తే మరీ మంచిది.
మొన్నటికిమొన్న స్పైడర్ సినిమా విషయంలో అదే చేశారు. త్వరలోనే 2.0 సినిమా విషయంలో కూడా ఇదే పద్ధతి అనుసరించబోతున్నారు. ఇప్పుడు బన్నీ సినిమాకు కూడా సేమ్ టు సేమ్ స్ట్రాటజీ ఫాలో అయిపోతున్నారు. అవును.. అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య సినిమాను ఏకంగా 7భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠి, భోజ్ పురి భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఇంత భారీగా విడుదల చేయడానికి రీజన్ కూడా చెబుతున్నారు మేకర్స్.
నా పేరు సూర్య సినిమా కథ యూనివర్సల్ సబ్జెక్ట్ అంట. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుందట. అందుకే ఒకేసారి 7భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామంటున్నారు మేకర్స్. ప్రయత్నం బాగానే ఉంది కానీ ప్రచారం ఎలా అన్నది ఆలోచించుకుంటే మంచిది.

No comments:

Post a Comment