Monday, 22 January 2018

జగన్‌ పాదయాత్రలో అపశృతి

- స్టేజీ కూలడంతో నలుగురు మహిళలకు గాయాలు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (చిత్తూరు)
                 జగన్‌ చేపట్టిన పాదయాత్రలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అకస్మాత్తుగా స్టేజీ కూలిపోవడంతో నలుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వైసిపి అధినేత జగన్‌ కాసేపట్లో పట్టణంలోని స్థానిక పెళ్ళి మండపంలోని స్టేజీ వద్దకు వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్న అభిమానులు ఆయన్ను చూడాలన్న తాపత్రయంలో ఒక్కసారిగా ముందుకు కదిలారు. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా స్టేజీ మొత్తం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో కింద ఉన్న మహిళలపై ఒక్కసారిగా పడటంతో తొట్టంబేడు మండలం బోనుపల్లికి చెందిన మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో నలుగురు మహిళల చేతి ఎముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. స్టేజీపై ఉన్న తొట్టంబేడు మండల వైసిపి అధ్యక్షుడు ఉన్నం వాసుదేవనాయుడు కాలుకు రక్తస్రావమైంది. ఇంకొందరు మహిళలు ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గుర్తించి వారిని 108 వాహనంలో శ్రీకాళహస్తికి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

No comments:

Post a Comment