Sunday, 21 January 2018

ప్రభాస్ సినిమాలో వివాదాల బ్యూటీ

అర్షి ఖాన్.. తెలుగు ప్రేక్షకులకు ఈమె పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ హిందీలో బిగ్ బాస్ షో చూసిన వాళ్లకు అర్షిఖాన్ గురించి పెద్దగా ప్రచారం అక్కర్లేదు. వివాదాలు సృష్టించడం కోసం ఏమైనా చేసే రకం, ఎంతకైనా తెగించే అమ్మాయి ఈ అర్షి ఖాన్. ఆ వివాదాలు, బరితెగించే బాడీ లాంగ్వేజే అర్షి ఖాన్ ను పాపులర్ చేశాయి. ఆ పాపులారిటీనే ఇప్పుడీమెకు ప్రభాస్ సినిమా ఆఫర్ తెచ్చిపెట్టింది.
అవును.. ప్రభాస్ సినిమాలో అర్షి ఖాన్ నటించనుంది. ఈ విషయాన్ని ఆమె అఫీషియల్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ సరసన ఓ భారీ సినిమాలో అర్షి ఖాన్ నటించబోతోందని, ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, బిగ్ బాస్ లాంటి వాళ్లకు థ్యాంక్స్ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
అయితే ఈ ప్రకటనలో సినిమా వివరాల్ని మాత్రం వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అర్షి ఖాన్ ను సెకెండ్ హీరోయిన్ గా తీసుకున్నారేమో అనే సందేహం కలుగుతుంది. అయితే అర్షి ఖాన్ మాత్రం తనది మెయిన్ లీడ్ అని ప్రకటించుకుంది. సాహోలో ఆల్రెడీ శ్రద్ధా కపూర్ ఉంది.
సాహో తర్వాత బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో అర్షి ఖాన్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అలియాభట్, కత్రినా లాంటి అమ్మాయిల కోసం ప్రయత్నిస్తున్నారక్కడ. సో.. అర్షి ఖాన్ ఏ సినిమాలో ప్రభాస్ సరసన కనిపించనుందనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

No comments:

Post a Comment