ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. గ్రూప్‌లో అడ్మిన్‌గా ఉండే వ్యక్తిని పూర్తిగా గ్రూప్ నుంచి తొలగించడకుండా అడ్మిన్‌గా మాత్రమే తొలగించే సౌకర్యం తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉంది.
వాట్సాప్ గ్రూప్‌లో ఎంతమందైనా గ్రూప్ అడ్మిన్‌లుగా ఉండొచ్చు. అయితే, అలా ఉన్నవారిని ఎవర్నైనా అడ్మిన్ బాధ్యతల నుంచి తొలగించాలంటే ముందు వారిని గ్రూప్ నుంచి పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. తర్వాత మళ్లీ అతడిని గ్రూప్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా అడ్మిన్‌ను నేరుగా తొలగించేందుకు వీలుగా ‘డిస్మిస్’ బటన్‌ను వాట్సాప్ కొత్తగా తీసుకురాబోతోంది. పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
దీంతోపాటు గ్రూప్ అడ్మిన్‌గా ఉండే వ్యక్తులకు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై ప్రస్తుతం వాట్సాప్ పనిచేస్తోంది. గ్రూప్‌లోని సభ్యులెవరైనా చేసే టెక్ట్స్, ఫొటో, వీడియో, జిఫ్, డాక్యుమెంట్, వాయిస్ మెసేజ్‌లు వంటివి ఏవైనా నియంత్రించే అధికారం అడ్మిన్‌లకు ఇవ్వనుంది. ఎవరైనా సభ్యడు ఇవి చేయాలంటే అడ్మిన్ అనుమతి తప్పనిసరి.
No comments:
Post a Comment