వాట్సప్ యాప్ లేని ఆండ్రాయిడ్ యూజర్‌లు దాదాపు ఉండరు. ఇది ఒక్కోసారి ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. చాలా మంది పనికిరాని ఫొటోలు, కొటేషన్‌లు పంపుతూ తమ సమయంతో పాటు ఇతరుల సమయం కూడా వృథా చేస్తుంటారు. చాలా మంది ఇది భరించలేక ఆయా నెంబర్లను బ్లాక్ చేస్తుంటారు. ఆ క్రమంలో ఒక్కోసారి పొరపాటున సన్నిహితుల నెంబర్లను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. అలా బ్లాక్ చేసి ఉంటే తెలుసుకోవవడం ఎలా!
- 1. మిమ్మల్ని బ్లాక్ చేస్తే వారి స్టేటస్ కనిపించదు. అలా ఎవరి స్టేటస్ కనిపించకపోతే వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు అనుకోవాలి.
- 2. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి ప్రొఫైల్ మీకు కనిపించదు. అలా కనిపించినా ఆ ప్రొఫైల్ పిక్చర్ బ్లాంక్‌లో కనిపిస్తుంది.
- 3. మిమ్మల్ని బ్లాక్ చేశారని తెలియక మీరు మెసేజ్ పంపితే సింగల్ టిక్ మాత్రమే కనిపిస్తుంది. బ్లూ కానీ, రెండు టిక్‌లు కానీ కనిపించవు.
- 4. మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మీ కాల్స్ వెళ్లవు.
- 5. మీరు ఒక గ్రూపును క్రియేట్ చేసి, అందులోకి మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తిని ఆహ్వానించినపుడు మీకు ‘యు ఆర్ ఆధరైజ్‌డ్ టు యాడ్ దిస్ కాంటాక్ట్’ అని కనిపిస్తుంది. అపుడు ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్లు గుర్తించాలి.
No comments:
Post a Comment