Monday, 22 January 2018

నేటి డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్‌తోనే అన్నీ అయిపోతున్నాయి. రోజులో ఒక్కసారైనా గూగుల్‌లో సెర్చ్‌(వెతకడం) చేయకుండా ఉండలేము. గూగుల్‌లో ఏదైనా సెర్చ్‌ చేయాలంటే ముందుగా మన దగ్గర ఇంటర్నెట్‌ సౌక ర్యం ఉండాలి. అలాంటిది మరి ఇంటర్నెట్‌ లేకుండానే గూగుల్‌లో మనకు కావా ల్సిన సమాచారం సెర్చ్‌ చేసుకునే అవకాశం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే గూగుల్‌ సంస్థ ఇటీవల కొత్తగా ఓ ఆండ్రాయిడ్‌ యాప్‌ను రూపొందించి ప్రవేశ పెట్టడానికి సిద్ధమైంది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండానే మనకు కావాల్సిన సమాచా రాన్ని ఈ యాప్‌లో పొందవచ్చు. దాని పేరే ‘గూగుల్‌ సెర్చ్‌ యాప్‌’. దాని గురించి కొంచెం తెలుసుకుందాం మరి. 
ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌..
త్వరలో రానున్న ఈ యాప్‌ ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసు కొని ఇన్‌ స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గూగుల్‌ యాప్‌ ఎప్పటి కప్పుడు మనం సెర్చ్‌ చేస్తున్న అంశాలను ముందుగానే స్టోర్‌ చేసుకొని ఉంటుంది. ఇప్పటి వరకు మనం సెర్చ్‌ చేసిన అంశా లను నెట్‌ అందుబాటులో లేన ప్పుడు కూడా సరైన సమాచారాన్ని పొందడానికి వీలుగా గూగుల్‌ కొత్త యాప్‌ను రూపొందిస్తోంది. అప్పటి వరకు యూజర్లు సెర్చ్‌ చేసిన పదాలను గూగుల్‌ స్టోర్‌ చేసుకొని పెట్టుకొని నెట్‌ కనెక్షన్‌ అందుబాటులోకి రాగానే ఆ పదాలకు అనుగుణంగా వెబ్‌ ఫలితాలను యూజర్‌కు చేరవేయనుంది. కొత్త ఫీచర్‌ను కలిగి ఉన్న గూగుల్‌ యాప్‌ త్వరలోనే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు అందు బాటులోకి రానుంది.

No comments:

Post a Comment